Monday, July 30, 2012



హృదయమా... 

ఈ ఉదయము  నా  'ప్రియ' సఖి వదనం పై 

చిరునవ్వు - పువ్వులుచిగురించుమా...
M S సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం తియ్యగా వినిపించుమా...
వెచ్చని సూర్య కాంతి తో శుభోదయం 
అని నా మాట గా పలకరించుమా...
నేనెక్కడ ఉన్న, తన క్షేమం కోసం సదా ఆరాటపడే 
నా పిచ్చి మనసుకు కుశలమే అని తెలుపుమా...










Sunday, September 25, 2011

నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు

                                (అందరూ సంతోషంగా ఉండాలి... నాతో పాటు..)

నేను నవ్విస్తాను.. నవ్వులుపాలూ  అవుతుంటాను.
అయినప్పటికీ నవ్విస్తూనే ఉంటాను...  ఎందుకంటే
నాకు మనసారా నవ్వాలని ఉంది,
దుఃఖానికి  ఈర్ష  పుట్టేల,
భాధలన్నీ దిగమింగుకుని.. సంతోషంగా గడపాలని ఉంది,
నేను నవ్వి చాలా రోజులు అయింది ఎందుకో తెలియదు.
సుఖ దుఖాల అయోమయం లో,
నట్ట నడిబొడ్డు బ్రతుకు సంద్రం లో,
గమ్యం తెలియని నావలా, దిక్కు తోచక నిలబడి చూస్తున్నాను.

అప్పటికి నవ్విస్తూనే ఉన్నాను నటిస్తూ..
జీవితం అనే నాటక రంగం లో రాజి పడకుండా,
నవ్వుతూ బ్రతికేందుకు, చిరునవ్వుతో ముందడుగు వేసేందుకు.

Wednesday, July 21, 2010

స్వేచ్చగా సేద తీరే సమయం కూడా లేకపొతే......
-- భగవాన్ దాస్ .జి
ప్రకృతి లోని అద్భుత అందాలను చూడటానికి సమయం కూడా లేకపోతే...
చెట్టు నీడన వున్నా గొర్రెలు, ఆవులు వలె విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకపోతే...
సెలయేటి లోని పూలను చూసే సమయం కూడా లేకపోతే,

పసిపాప నవ్వును చూసే తీరికే లేకపోతే...
సూర్యకాంతి ప్రతిబింబం వలన నీటిపై మెరిసే నక్షత్రాలను చూసే సమయం కూడా లేకపోతే ...

నీ జీవిత కాలం లో ఒక 'గడియ' అయిన, ఒక గంట అయిన, నీకు జీవితాన్ని ప్రసాదించిన
ఆ సర్వోన్నత సర్వేశ్వరుని ప్రార్దించి, స్తుతించి కృతజ్ఞత తెలిపే తీరికే లేకపోతే...

సాటి మనిషి కళ్ళలో చూస్తూ, అపార్ధాలు, బేషజాలు పక్కనబెట్టి
ఒక్క చిరునవ్వుతో 'బాగున్నారా' అని మనస్పూర్తిగా
పలకరించే కనీస హృదయం కూడా లేకపోతే...

ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నపుడు మనం సాయం చేయలకపోయిన,
కష్టాల్ని ఎదుర్కొనే ఓదార్పును, దైర్యాన్ని ఇచ్చే సహృదయం కూడా లేకపోతే...

మన జీవితాలకు అర్థమే లేదు...

Tuesday, July 20, 2010


ఆశ ...

- చుక్కపల్లి పిచ్చయ్య, ప్రాఫిట్ షూ కంపెనీ ఫౌండర్
ఆశ జీవితానికి, భవిష్యత్తుకు పునాది.
వర్తమానానికి, భవిష్యత్తుకు వారధి.
చికటిలోంచి వెలుగు చూపేది ఆశ.
దుఃఖాన్ని దిగామింగేసి గుండె బలాన్నిచ్చేది ఆశే.

ఆశ లేకుండా మనకు అరఘడియ కూడా గడవదు.
ఆశ ఆసరా లేకుండా ఒక్క అడుగైన ముందుకు పడదు.
ఆశ మన జీవితానికి ఒక అద్భుత వరం.
మనం నిరాశలో ఉన్న, నిస్పృహ లో ఉన్నా,
మన భుజం తట్టి ముందుకు నడిపించేది ఆశ మాత్రమే.

అంతెందుకు ఈ ఆశ అనేది లేకపోతే
మనిషి గుండె ఎప్పుడో ఆగిపొయి ఉండేది.
అయితే ఆకాశానికి హద్డులునట్లే
మన ఆశ కు హద్దులు ఉండాలి.

ముఖ్యంగా " నిరాశ లో కూడా దురాశ ను దరిచేరనియకూడదు. "

Saturday, July 17, 2010


( ఇంటర్మీడియట్ కాలేజీ డేస్ లో నేను ఒనె సైడ్ లవ్ చేసిన రేణుక కూడా అచ్చు ఇలానే ఉండేది)

ప్రేమలేఖ లాంటిది ....
కాని కాదు

మీ నవ్వు వసంతం లో పుష్పం లా వికసించినట్లుంది.
మీ నవ్వు కల్లాకపటం ఎరుగని పసిపాప నవ్వు వలె వుంటుంది.
మీ స్వచ్చమైన చిరునవ్వు చూస్తే పట్టా పగలే 'వెన్నల' దిగివచ్చినట్లుంది.
మీ 'నవ్వు' ప్రకృతి లోని అందమంతా, ఒక్క క్షణం నా కళ్ళ ముందున్నట్టు అనిపిస్తుంది.
మీ నవ్వు చాల.. చాలా.. చాలా బాగుంది.

"మనిషికి చిరునవ్వు, పుష్పానికి సూర్యరశ్మి లాంటిది."
మీరు కలకాలం నవ్వుతూ ఉండాలని ...
ఆశిస్తూ...
మీ శ్రేయోభిలాషి,
జి. భగవాన్ దాస్.

Saturday, March 20, 2010



College Pics Slideshow

Friday, March 19, 2010

A Programmer's Frustrution - funny Skit.


See My college video. This Show is immitation of Bommarillu. It's Name is 'A Programmar Frustrution' see & enjoy fun.