-- భగవాన్ దాస్ .జి
ప్రకృతి లోని అద్భుత అందాలను చూడటానికి సమయం కూడా లేకపోతే...చెట్టు నీడన వున్నా గొర్రెలు, ఆవులు వలె విశ్రాంతి తీసుకునే సమయం కూడా లేకపోతే...
సెలయేటి లోని పూలను చూసే సమయం కూడా లేకపోతే,
పసిపాప నవ్వును చూసే తీరికే లేకపోతే...
సూర్యకాంతి ప్రతిబింబం వలన నీటిపై మెరిసే నక్షత్రాలను చూసే సమయం కూడా లేకపోతే ...
నీ జీవిత కాలం లో ఒక 'గడియ' అయిన, ఒక గంట అయిన, నీకు జీవితాన్ని ప్రసాదించిన
ఆ సర్వోన్నత సర్వేశ్వరుని ప్రార్దించి, స్తుతించి కృతజ్ఞత తెలిపే తీరికే లేకపోతే...
సాటి మనిషి కళ్ళలో చూస్తూ, అపార్ధాలు, బేషజాలు పక్కనబెట్టి
ఒక్క చిరునవ్వుతో 'బాగున్నారా' అని మనస్పూర్తిగా
పలకరించే కనీస హృదయం కూడా లేకపోతే...
ఎదుటి మనిషి కష్టాల్లో ఉన్నపుడు మనం సాయం చేయలకపోయిన,
కష్టాల్ని ఎదుర్కొనే ఓదార్పును, దైర్యాన్ని ఇచ్చే సహృదయం కూడా లేకపోతే...
మన జీవితాలకు అర్థమే లేదు...
4 comments:
nice. keep it up.
hi Bhagavan Das,
చిన్న సలహా... కామెంట్స్‌కి మోడరేషన్ తీసెయ్యి.
comments post cheyyaraa..?
well said!
Post a Comment